ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, 128 ఏళ్ల బాబా శివానంద 2025, మే 4న వారణాసిలో మరణించారు. 1896 ఆగస్టు 8న సిలెట్ జిల్లా (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)లో శివానంద జన్మించారు. ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అనంతరం బెంగాల్‌లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద ఆయనను పెంచిపెద్దచేయడమే కాకుండా బాబాకు గురువుగా మారారు. ఆయన మార్గదర్శకత్వంలో బాబా శివానంద యోగా, ఆధ్యాత్మిక విద్య, జీవన విలువలను నేర్చుకున్నారు. బాబా శివానంద యోగా, ఆధ్యాత్మిక సేవలకు గుర్తింపుగా 2022లో ఆయనను పద్మశ్రీ పురస్కారం వరించింది.