 
        
      పంజాబ్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (బీఎప్‌యూహెచ్‌ఎస్), రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 174
వివరాలు:
1. ప్రొఫెసర్ - 41
2. అసోసియేట్ ప్రొఫెసర్ - 27
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 106
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2025, జనవరి 1వ తేదీ నాటికి 40 ఏళ్ల నుంచి 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.2,360. ఎస్సీ అభ్యర్థులకు రూ.1180.
దరఖాస్తు చివరి తేదీ: 03-11-2025.