బొకారో పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ (బీపీఎస్‌సీఎల్), రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
అసిస్టెంట్ మేనేజర్ (బాయిలర్ ఆపరేషన్ ఇంజినీర్) - 15
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్(మెకానికల్/ఎలక్ట్రికల్/ కెమికల్/ పవర్ ప్లాంట్/ ప్రొడక్షన్/ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణులై ఉండాలి
గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2026 మార్చి 5.