Published on Oct 26, 2024
Walkins
బనవాసి కేవీకేలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
బనవాసి కేవీకేలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

* యంగ్ ప్రొఫెషనల్: 06 పోస్టులు

ఖాళీలున్న స్థానాలు: కేవీకే బనవాసి (కర్నూలు జిల్లా), కేవీకే కొండెంపూడి (విశాఖపట్నం జిల్లా), కేవీకే రస్తాకుంటుబాయి (విజయనగరం జిల్లా), కేవీకే ఉటుకూరు (కడప జిల్లా).

అర్హత:  బీఎస్సీ, పీజీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణతతో పాటు ఫీల్డ్ ఎక్స్‌టెన్షన్ అనుభవానికి ప్రాధాన్యం ఉంటుంది. 

వయస్సు: 21 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.30,000.

ఇంటర్వ్యూ తేదీ: 02.11.2024.

వేదిక: ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ కార్యాలయం, కేవీకే, బనవాసి, కర్నూలు జిల్లా.

Website: https://angrau.ac.in/