ఇండియన్ బ్యాంక్‌కు మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), సీఈఓగా బినోద్ కుమార్‌ను నియమించేందుకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) సిఫారసు చేసింది.
ప్రస్తుతం కుమార్ పంజాబ్ నేషనల్ నేషనల్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్నారు. ఇండియన్ బ్యాంక్‌కు ఎండీ, సీఈఓగా ఉన్న ఎస్ ఎల్ జైన్ 2024, డిసెంబరులో పదవీ విరమణ చేయనున్నారు.
ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫారసుకు ప్రధాన మంత్రి నేతృత్వంలోని నియామకాల కమిటీ ఆమోదం తెలిపితే.. జైన్ స్థానంలో బినోద్ కుమార్ ఇండియన్ బ్యాంక్‌కు ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపడతారు.