బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2025, ఫిబ్రవరి 3న వెల్లడించారు.
2009-14 మధ్యకాలంలో గత యూపీయే ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి ఏటా సగటున కేటాయించిన రూ.886 కోట్లతో పోలిస్తే ఇది 6 రెట్లు అధికమని పేర్కొన్నారు.
తెలంగాణలో 2014 నుంచి ఇంతవరకూ 753 కి.మీ. కొత్తట్రాక్ నిర్మించాం. ఇది యూఏఈ మొత్తం రైల్వే నెట్‌వర్క్‌తో దాదాపు సమానం.
రాష్ట్రంలో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయింది. 453 ఫ్లైఓవర్లు, అండర్‌బ్రిడ్జిలు నిర్మితమయ్యాయి. 62 లిఫ్ట్‌లు, 17 ఎస్కలేటర్లు, 48 స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.