Published on Nov 13, 2024
Apprenticeship
బీడీఎల్‌, కంచన్‌బాగ్ యూనిట్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీడీఎల్‌, కంచన్‌బాగ్ యూనిట్‌లో అప్రెంటిస్ పోస్టులు

హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌) అప్రెంటిస్‌షిప్‌ ట్రెయినింగ్‌ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం ఖాళీలు: 150

వివరాలు:

ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్, మెషినిస్ట్ గ్రైండర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ ఆర్‌ & ఏసీ, టర్నర్, వెల్డర్.

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 11-11-2024 నాటికి 14 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-11-2024.

హార్డ్ కాపీ దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ: 06-12-2024.

Website:https://bdl-india.in/

Apply online:https://nats.education.gov.in/