దిల్లీలోని భరుచ్ దహేజ్ రైల్వే కంపెనీ లిమిటెడ్ (బీడీఆర్‌సీఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
వివరాలు:
1. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ): 01
2. మేనేజర్(హెచ్/అడ్మినిస్ట్రేషన్): 01
3. మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్ అకౌంట్): 02
4. అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ అకౌంట్): 01
5. మేనేజర్(సివిల్): 01
6. సీనియర్ ఏఎం/ఏఎం-ట్రాక్: 01
7. సీనియర్ ఏఎం/ఏఎం-వర్క్స్: 01
8. సీనియర్ ఏఎం/ఏఎం-టీఆర్‌డీ అండ్ ఎలక్ట్రికల్: 01
9. సీనియర్ ఏఎం/ఏఎం-సిగ్నల్: 01
10. సీనియర్ ఏఎం/ఏఎం-టెలికమ్: 01
విభాగాలు: ఫైనాన్స్, హెచ్‌ఆర్/అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ట్రాక్, వర్క్స్, టీఆర్‌డీ అండ్ ఎలక్ట్రికల్, సిగ్నల్, టెలికామ్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఎ, సీఎఫ్‌ఏ, డిగ్రీ, హెచ్‌ఆర్, ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం, బీటెక్(సివిల్), డిప్లొమా(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 20-02-2025 తేదీ నాటికి చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌కు 45 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 30 ఏళ్లు, మిగతా పోస్టులకు 40 ఏళ్లు నిండి ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌కు రూ.70,000 - రూ.2,00,000, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్‌కు రూ.60,000, అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్ అకౌంట్)కు రూ.30,000 - రూ.1,20,000, మేనేజర్(ఎఫ్ అండ్ ఏ)కు రూ.50,000 - రూ.1,60,000, అసిస్టెంట్ మేనేజర్(ఎఫ్ అండ్ ఏ)కు రూ.40,000 - రూ.1,40,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, ఈ మెయిల్ ద్వారా agmhr@bdrail.in
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 20-03-2025.