ప్రముఖ దినపత్రిక ది ఎకనమిక్ టైమ్స్ ఏటా అందించే ప్రతిష్ఠాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును వరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు ఆయన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ‘ది ఎకనమిక్ టైమ్స్’ ప్రకటించింది. 2026 మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సీఎం ఈ అవార్డును అందుకోనున్నారు.