కళింగ వీరుడిగా పేరొందిన బిజు బాబుకు రష్యా సాహస పురస్కారం ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధంలో బిజు రష్యాకు సహకరించినందుకు దీన్ని ప్రదానం చేస్తున్నట్లు దిల్లీలోని రష్యా రాయబారి కార్యాలయం ప్రకటించింది.
బిజు తరఫున ఆయన కుమారుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పురస్కారాన్ని స్వీకరించారు.
బిజు భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనే కాకుండా ఇండోనేసియా విముక్తి ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ‘భూమిపుత్రుడి’గా ఇండోనేసియా గతంలోనే ఆయనను సత్కరించింది.