బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది. మూడింట రెండు వంతుల స్థానాల్లో నెగ్గి.. రెండు దశాబ్దాల తర్వాత బంగ్లా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు, బీఎన్‌పీ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్(60) దేశ నూతన ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగిన 299 పార్లమెంటు స్థానాల్లో 209 సీట్లలో బీఎన్‌పీ విజయఢంకా మోగించింది. పాకిస్థాన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలున్న మతతత్వ పార్టీ జమాత్-ఏ-ఇస్లామీ 68 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.
చివరిసారిగా బీఎన్‌పీ 2001లో అధికారంలోకి వచ్చింది. 2006 వరకు కొనసాగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీయే నెగ్గుతూ వచ్చింది.