బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల కృషిని, అంకితభావాన్ని గుర్తించాలనే లక్ష్యంతో మన దేశంలో ఏటా ఏప్రిల్ 4న బొగ్గు గని కార్మికుల దినోత్సవంగా నిర్వహిస్తారు. విద్యుత్, పారిశ్రామిక ఉత్పత్తి సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించే అత్యంత ముఖ్యమైన శిలాజ ఇంధనాల్లో బొగ్గు ఒకటి. భూమిలో నుంచి దీన్ని వెలికితీయడం శ్రమతో పాటు ప్రమాదకరం కూడా. ఈ పని చేస్తోన్న కార్మికులను గుర్తుంచుకోవడంతోపాటు దేశ ఆర్థికాభివృద్ధిలో వారి పాత్రను స్మరించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
దేశంలో మొదటి భూగర్భ బొగ్గు గనిని పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్‌లో 1907, మే 4న ప్రారంభించారు. దీనికి గుర్తుగా ఏటా ఆ తేదీన ‘బొగ్గు గని కార్మికుల దినోత్సవం’ జరుపుకోవాలని 2017లో ప్రభుత్వం తీర్మానించింది.