టోక్యో ఒలింపిక్స్ పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్‌కు ఆసియా బాక్సింగ్ సమాఖ్య అథ్లెట్స్ కమిషన్‌లో స్థానం లభించింది.
ప్రపంచ బాక్సింగ్ (డబ్ల్యూబీ) కొత్తగా ఏర్పాటు చేసిన ఆసియా కౌన్సిల్ తాత్కాలిక కమిటీలో భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ప్రతినిధులకు ప్రాధాన్యం దక్కింది.
బీఎఫ్‌ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యాడు.
కార్యదర్శి హేమంతకుమార్ కాలిటా, కోశాధికారి దిగ్విజయ్ సింగ్‌లకు ఒలింపిక్ కమిషన్, ఫైనాన్స్- ఆడిట్ కమిటీలలో అవకాశం లభించింది.
నరేందర్‌కుమార్ నిర్వాణ్, డి.పి.భట్, డాక్టర్ కరణ్‌జీత్ సింగ్‌లకు వివిధ కమిటీల్లో చోటు దక్కింది.