అంతర్జాతీయ బుకర్ ప్రైజ్-2025 రేసులో కన్నడ రచయిత, సామాజిక కార్యకర్త, న్యాయవాది బాను ముస్తాక్ రాసిన చిన్న కథల సంకలనం ‘హార్ట్ ల్యాంప్’ నిలిచింది.
ఆయన కన్నడలో దాన్ని రాయగా, ఆంగ్లంలోకి దీపా భస్తీ అనువదించారు. మొత్తం 13 పుస్తకాలతో తుది జాబితాను జడ్జీలు రూపొందించారు.
దక్షిణ భారత దేశంలోని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారి 12 కథల సంపుటమే ‘హార్ట్ ల్యాంప్’. ఇవి 1990-2023 మధ్య ప్రచురితమయ్యాయి.
ఏప్రిల్ 8వ తేదీన ఈ 13 పుస్తకాల నుంచి ఆరింటిని తుది పోటీలకు ఎంపిక చేస్తారు. మే 20వ తేదీన విజేతను ప్రకటిస్తారు.