Published on Nov 14, 2024
Current Affairs
బుకర్‌ ప్రైజ్‌ విజేతగా హార్వే
బుకర్‌ ప్రైజ్‌ విజేతగా హార్వే

అంతరిక్ష యాత్రికులపై బ్రిటన్‌ రచయిత్రి సమంతా హార్వే రాసిన ‘ఆర్బిటల్‌’ నవల 2024 ఏడాదికిగాను ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ విజేతగా ఎంపికైంది.

2024, నవంబరు 13న లండన్‌లోని ఓల్డ్‌ బిల్లింగ్స్‌గేట్‌ వద్ద జరిగిన వేడుకలో విజేతను న్యాయనిర్ణేతలు ప్రకటించారు.

ఈ బహుమతి కింద రచయితకు 50 వేల పౌండ్లు (రూ.53.65 లక్షలు) అందజేస్తారు. బ్రిటన్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన కేవలం 136 పేజీల నవలిక ఇది.