కెనడియన్-హంగరియన్-బ్రిటిష్ రచయిత డేవిడ్ సలై ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ గెలుపొందారు. ఆయన రచించిన ‘ఫ్లెష్’ నవలకుగానూ ఈ అవార్డు దక్కింది. భారత రచయిత్రి కిరణ్ దేశాయ్ నవల ‘ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ నవలను వెనక్కినెట్టి ఈ పోటీలో ఆయన విజయం సాధించారు. 51 ఏళ్ల డేవిడ్ సలై తుదిపోరులో ఐదుగురు పోటీదారులను అధిగమించారు. 2025, నవంబరు 11న లండన్‌లో జరిగిన వేడుకలో డేవిడ్ రూ.50,000 పౌండ్లను, జ్ఞాపికను అందుకున్నారు. 2024 బుకర్ ప్రైజ్ విజేత సమంత హార్వీ వీటిని అందజేశారు.