న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
యంగ్ ప్రొఫెషనల్స్ (మేనేజ్‌మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్‌మెంట్)- 03
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.70,000.
వయోపరిమితి: 18.04.2025 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, రాత పరీక్ష, టెక్నికల్ పరిజ్ఞానం, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.04.2025.
Website:http://www.bis.gov.in/