బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన ఎయిమ్స్ జమ్మూ పరిధిలోని వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 407
వివరాలు:
అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ డైటీషియన్, చీఫ్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, కోడింగ్ క్లర్క్, జూనియర్ ఇంజినీర్, డీఈఓ, జూనియర్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, సీనియర్ హిందీ ఆఫీసర్, లైబ్రేరియన్, స్టోర్ కీపర్, స్టోర్ ఆఫీసర్, గ్రాఫిక్ డిజైనర్, జూనియర్ రిసెర్చ్ ఆఫీసర్ తదితరాలు..
అర్హత: పోస్టును అనుసరించి పది, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళా అభ్యర్థులకు రూ.590; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ పీహెచ్ వారికి రూ.295.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, బీఈసీఐఎల్ భవణ్, సెక్టార్-62, నోయిడా (ఉత్తర్‌ప్రదేశ్) చిరునామాకు స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 24-02-2025.
Website:https://www.becil.com/Vacancies