కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్), భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యాలయంలో పనిచేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బందిని కోరుతోంది.
మొత్తం పోస్టులు: 10
వివరాలు:
డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హతలు: అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఎంఎస్-ఎక్సల్‌లో ప్రావీణ్యం ఉండాలి.
టైపింగ్ వేగం: ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషానికి కనీసం 35 పదాల వేగం ఉండాలి.
వేతనం: నెలకు రూ.24,000 (స్థిర వేతనం) చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 5, 2026.
Website:https://www.becil.com/Vacancies