Published on Nov 27, 2025
Government Jobs
బీఈసీఐఎల్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు
బీఈసీఐఎల్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు

నొయిడాలోని బ్రాడ్ కాస్ట్‌ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 18

వివరాలు:

1. డ్రైవర్‌: 05

2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈఓ): 10

3. మెడికల్ ఫిజిసిస్ట్(రేడియో థెరపి): 01

4. మెడికల్ ఫిజిసిస్ట్‌(రేడియాలజీ): 01

5. మెడికల్ ఫిజిసిస్ట్‌(న్యూక్లియర్‌ మెడిసిన్‌): 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. 

వయోపరిమితి: డ్రైవర్‌కు 21 నుంచి 40 ఏళ్లు, డేటా ఎంట్రీ పరేటర్‌కు 18 నుంచి 40 ఏళ్లు, మెడికల్ ఫిజిసిస్ట్‌కు 35 ఏళ్లు.

జీతం: నెలకు డ్రైవర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,506, మెడికల్ ఫిజిసిస్ట్‌కు రూ.75,000,

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.295. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. 

దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 7.

చిరునామా: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL), బీఈసీఐఎల్‌ భవన్, సీ-56/ఏ-17, సెక్టార్-62, నోయిడా-201307 (ఉత్తర్‌ప్రదేశ్‌) చిరునామాకు దరఖాస్తులు పంపిచాలి.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా.

Website:https://www.becil.com/Vacancies