Published on Dec 24, 2025
Government Jobs
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు

నొయిడాలోని బ్రాడ్ కాస్ట్‌ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 76

వివరాలు:

1. టెక్నికల్ అసిస్టెంట్‌ (ఈఎన్‌టీ): 01

2. ఆఫ్తాల్మిక్‌ టెక్నీషియన్: 03

3. పేషంట్‌ కేర్‌ మేనేజర్‌(పీసీఎం): 05

4. పేషంట్‌ కేర్‌ కో-ఆర్డినేటర్‌(పీసీసీ): 01

5. అసిస్టెంట్‌ డైటీషియన్‌: 02

6. మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌ (ఎంఆర్‌టీ): 03 

7. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈఓ) మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షనిస్ట్‌: 30

8. టైలర్‌: 01

9. మెడకల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌(ఎంఎల్‌టీ): 05

10. ల్యాబ్ అటెండెంట్‌: 01

11. డెంటల్‌ టెక్నీషియన్‌: 02

12. పీటీఐ-ఫీమేల్‌: 01

13. రేడియో గ్రాఫర్‌: 01

14. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 10

15. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌)-మేల్‌: 10

16. ఫుడ్‌ బేరర్‌: 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎనిమిది, పదో తరగతి, ఇంటర్‌, బీఎస్సీ, బీపీఈడీ, డిగ్రీ, ఎంఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు పోస్టులను అనుసరించి నెలకు రూ.20,930 నుంచి రూ.40,710.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.295. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. 

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 2.

చిరునామా: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌), బీఈసీఐఎల్‌ భవన్, సీ-56/ఏ-17, సెక్టార్-62, నోయిడా-201307 (ఉత్తర్‌ప్రదేశ్‌) చిరునామాకు దరఖాస్తులు పంపిచాలి.

Website:https://www.becil.com/Vacancies