రక్షణ మంత్రిత్వశాఖ 2025, ఏప్రిల్ 7న బెంగళూరు కేంద్రంగా పనిచేసే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)తో సుమారు రూ.2,385 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.
దీని ప్రకారం స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (ఈడబ్ల్యూ) సూట్స్, భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 వీ5 హెలికాప్టర్లలో ఎయిర్‌క్రాఫ్ట్ మోడిఫికేషన్ కిట్స్..వాటి ఇన్‌స్టాలేషన్‌ను అందించాలి.
కీలకమైన ఈ సూట్‌తో ప్రతికూల వాతావరణంలో హెలికాప్టర్ పనితీరును మెరుగుపరుస్తుందని తెలిపింది.