భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)కు రక్షణశాఖ నుంచి 2025, ఫిబ్రవరి 20న రూ.1220 కోట్ల కాంట్రాక్టు లభించింది.
దీనిప్రకారం భారత తీర రక్షక దళానికి 149 అత్యాధునిక రేడియోల (స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ రేడియోస్)ను అందించాల్సి ఉంటుంది.
ఈ పరికరాలతో తీరరక్షక దళం విధుల నిర్వహణ సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని రక్షణశాఖ తెలిపింది.