Published on Sep 2, 2025
Government Jobs
బీఈఎంఎల్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
బీఈఎంఎల్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని పబ్లిక్ సెక్టార్ సంస్థకు చెందిన బీఈఎంఎల్‌ వివిధ విభాగాల కోసం ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా ప్రొఫెషనల్స్‌ను ఫైనాన్స్, హెచ్‌ఆర్‌, మెట్రో బిజినెస్, రైల్వే మాన్యుఫాక్చరింగ్, ఇంజిన్ డిజైన్, టెస్టింగ్ తదితర విభాగాల్లో ఖాళీల భర్తీ చేయనుంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 27

వివరాలు:

చీఫ్ జనరల్ మేనేజర్: 03

జనరల్ మేనేజర్: 02

డిప్యూటీ జనరల్ మేనేజర్: 09

మేనేజర్: 02

అసిస్టెంట్ మేనేజర్: 11

విభాగాలు: ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, రోలింగ్‌ స్టాక్‌ మాన్యుఫాక్చరింగ్, మెట్రో బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌, ఎలక్ట్రానిక్స్‌ ఏరోస్పేస్‌, ప్రొడక్షన్‌ ప్లానింగ్‌, ఇంజిన్‌ డిజైన్‌, టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇంజిన్‌ ప్రాజెక్ట్‌, అనాలసిస్‌, ఇంజిన్‌ టెస్టింగ్‌, రాజ్‌భాషా/ అఫీషియల్‌ లాంగ్వేజ్‌.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, ఎంబీఏ, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం ఉండాలి. 

వయోపరిమితి: అసిస్టెంట్‌ మేనేజర్‌కు 30 ఏళ్లు;  మేనేజర్‌కు 34 ఏళ్లు; డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు 45ఏళ్లు; జనరల్‌ మేనేజర్‌కు 48 ఏళ్లు; చీఫ్ జనరల్‌ మేనేజర్‌కు 51 ఏళ్లు మించకూడదు.

జీతం: అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000; మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు రూ.90,000- రూ.2,40,00; జనరల్‌ మేనేజర్‌కు రూ.1,00,000- రూ. 2,60,000; చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌కు రూ.1,20,000- రూ.2,80,000.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ/అసెస్‌మెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ఆధారంగా.

ఫీజు: రూ.500 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 12.09.2025. 

Website:https://www.bemlindia.in/careers/