Published on Oct 11, 2024
Government Jobs
బీఈఎంఎల్ బెంగళూరులో మేనేజీరియల్ ఖాళీలు
బీఈఎంఎల్ బెంగళూరులో మేనేజీరియల్ ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్‌ లిమిటెడ్ (బీఈఎంఎల్) ఒప్రంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 40

వివ‌రాలు:

1. మేనేజర్: 10
2. జనరల్ మేనేజర్: 02 
3. అసిస్టెంట్ మేనేజర్: 10
4. డిప్యూటీ జనరల్ మేనేజర్: 12
5. అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 02
6. చీఫ్ జనరల్ మేనేజర్: 03
7. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: 01

విభాగాలు: రైల్ అండ్ మెట్రో డివిజన్, రోలింగ్ స్టాక్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ, రిసెర్చ్ అండ్ డిజైన్, టెస్టింగ్, స్టోర్స్‌, మెయింటెనెన్స్‌, ఫైనాన్స్‌, హెచ్ఆర్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, సీఏ/సీఎంఏ, డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 నుంచి 54 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ధ్రుపపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ ధ‌రఖాస్తుల‌కు చివరి తేదీ: 25-10-2024.

Website:https://www.bemlindia.in/