Published on Jan 24, 2025
Government Jobs
బీఈఎంఎల్ బెంగళూరులో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
బీఈఎంఎల్ బెంగళూరులో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్‌ లిమిటెడ్ (బీఈఎంఎల్) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఓఎల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టులు: 7

వివరాలు:

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణత, హిందీ టైపింగ్‌, కంప్యూటర్‌ స్కిల్స్‌ ఉండాలి.

వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు మొదటి ఏడాది రూ.28,000; రెండో ఏడాది రూ.31,000; మూడో ఏడాది రూ.34,000; నాలుగో ఏడాది రూ.37,500.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 05.02.2025.

ఇంటర్వ్యూ తేదీలు: దిల్లీలో 05.02.2025; బెంగళూరులో 19.02.2025.

వేదిక: బెంగళూరు- బీఈఎంఎల్‌ సౌదా, 23/1, 4వ మెయిన్‌, ఎస్‌ఆర్‌నగర్‌, బెంగళూరు.

దిల్లీ- ఈ, ఎఫ్, జీ, హెచ్‌, వందన, 11వ అంతస్తు, 11 టోస్టీ మార్గ్‌, న్యూ దిల్లీ.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూల ఆధారంగా.

Website:https://www.bemlindia.in/