Published on Sep 3, 2025
Government Jobs
బీఈఎంఎల్‌లో సెక్యూరిటీ, ఫైర్‌ సర్వీస్‌ పర్సనల్స్‌ పోస్టులు
బీఈఎంఎల్‌లో సెక్యూరిటీ, ఫైర్‌ సర్వీస్‌ పర్సనల్స్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్‌ లిమిటెడ్ (బీఈఎంఎల్ లిమిటెడ్) ఒప్పంద ప్రాతిపదికన సెక్యూరిటీ గార్డ్‌, ఫైర్‌ సర్వీస్‌ పర్సనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 56

వివరాలు:

సెక్యూరిటీ గార్డ్‌: 44

ఫైర్‌ సర్వీస్‌ పర్సనల్స్‌: 12

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యూలేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 29 ఏళ్లు మించకూడదు. 

జీతం: నెలకు మొదటి ఏడాది రూ.20,000; రెండో ఏడాది రూ.23,000.

దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 12.09.2025.

Website:https://www.bemlindia.in/