Published on Nov 4, 2024
Government Jobs
బీఆర్‌బీఎన్ఎంఎల్‌లో మేనేజీరియల్ పోస్టులు
బీఆర్‌బీఎన్ఎంఎల్‌లో మేనేజీరియల్ పోస్టులు

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్ఎంఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మేనేజీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివ‌రాలు:

1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్-ఈఆర్‌పీ: 03

2. డిప్యూటీ మేనేజర్: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎఫ్‌ఏ/ బీవీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ పోస్టులకు 32-50 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 31 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ పోస్టులకు రూ.1,48,000; డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.56,100.

దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది చీఫ్ జనరల్ మేనేజర్, భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేటు లిమిటెడ్, బీటీఎం లేఅవుట్, బన్నెరఘట్ట రోడ్, బెంగళూరు’ చిరునామాకు పంపించాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 15-11-2024.

Website:https://www.brbnmpl.co.in/