ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతి ప్రారంభమైంది. ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం లోడ్‌తో వెళ్లే నౌకను 2025, మార్చి 31న హోప్ ఐలాండ్ సమీపంలోని ఇన్నర్ యాంకర్ వద్ద తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
మొత్తం 8 లక్షల టన్నుల ఐఆర్ 64/1010 రకం బియ్యం ఎగుమతికి ఫిలిప్పీన్స్‌తో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు ఒప్పందం కుదిరింది. రూ.45 కోట్ల విలువైన 12,500 టన్నులతో మొదటి నౌక బయల్దేరింది.