Published on Sep 18, 2024
Current Affairs
ఫలితమివ్వని యాంటీబయాటిక్స్‌
ఫలితమివ్వని యాంటీబయాటిక్స్‌

విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ వాడటం వల్ల ఆ మందులను తట్టుకునే శక్తిని రోగకారక బ్యాక్టీరియా సంతరించుకుంటోంది. ఫలితంగా యాంటీబయాటిక్స్‌ పనిచేయక 1990-2021 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మందికి పైగా మరణించారు. వచ్చే 25 ఏళ్లలో యాంటీబయాటిక్స్‌కు లొంగని రోగాల వల్ల 3.9 కోట్లమంది మరణించే ప్రమాదం ఉందని వైద్యవిజ్ఞాన పత్రిక లాన్సెట్‌లో ప్రచురితమైన అధ్యయన నివేదిక హెచ్చరించింది. వీటిలో అత్యధిక మరణాలు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లోనే సంభవించనున్నాయి.