భారతదేశ రిటెయిల్ విపణి 2030 నాటికి ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.88 లక్షల కోట్ల) స్థాయికి చేరుకుంటుందని వెంచర్ క్యాపిటల్ సంస్థ ఫైర్‌సైడ్ వెంచర్స్ నివేదిక పేర్కొంది. ప్రజల ఆదాయాలు పెరగడం, డిజిటల్ స్వీకరణ వేగంగా ఉండటం, ఆకాంక్షించే వినియోగదార్లు పెరగడంతో రిటెయిల్ రంగం వృద్ధి దిశగా కొనసాగుతుందని వివరించింది. ఈ నివేదిక ప్రకారం..
రిటెయిల్ రంగంలో మార్పు పరిమాణంలో మాత్రమే కాకుండా, ప్రజలు షాపింగ్ చేసే విధానంలోనూ వస్తుంది. 2014లో రిటెయిల్‌లో సంప్రదాయ వాణిజ్యం 90 శాతానికి పైగా ఉండగా, 2030 నాటికి ఇది 70 శాతానికి తగ్గుతుంది. ఇదే సమయంలో ఆధునిక వాణిజ్యం, ఇ-కామర్స్, క్విక్ కామర్స్, నేరుగా వినియోగదార్లకు చేరే బ్రాండ్లు (డి2సి) వేగంగా వృద్ధి చెందుతాయి.