Published on Apr 30, 2025
Government Jobs
ఫెర్రో స్క్రాప్‌ నిగమ్ లిమిటెడ్‌లో పోస్టులు
ఫెర్రో స్క్రాప్‌ నిగమ్ లిమిటెడ్‌లో పోస్టులు

ఫెర్రో స్క్రాప్‌ నిగమ్ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌) వివిధ విభాగాల్లో  కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 44

వివరాలు:

1. జూనియర్‌ మేనేజర్‌(ఈ1)/ అసిస్టెంట్ మేనేజర్‌(ఈ2): 11

2. మేనేజర్‌(ఈ4)/సీనియర్‌ మేనేజర్‌(ఈ5): 03

3. జూనియర్‌ మేనేజర్‌(ఈ1)/ అసిస్టెంట్ మేనేజర్‌(ఈ2): 06

4. మేనేజర్‌(ఈ4)/సీనియర్‌ మేనేజర్‌(ఈ5): 02

5. జూనియర్‌ మేనేజర్‌(ఈ1): 09

6. అసిస్టెంట్ మేనేజర్‌(ఈ2)/ డిప్యూటీ మేనేజర్‌(ఈ3): 01

7. మేనేజర్‌(ఈ4)/ సీనియర్‌ మేనేజర్‌(ఈ5): 02

8. ఎగ్జిక్యూటివ్(ఈ0)/ జూనియర్‌ మేనేజర్‌(ఈ1)/ అసిస్టెంట్ మేనేజర్‌(ఈ2): 07

9. ఎగ్జిక్యూటివ్(ఈ0)/ జూనియర్‌ మేనేజర్‌(ఈ1)/ అసిస్టెంట్ మేనేజర్‌(ఈ2): 03

విభాగాలు: ఆపరేషన్‌, మెయింటనెన్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, మెటీరియల్ మేనేజ్‌మెంట్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌/బీఈ, ఎల్ఎల్‌బీ, డిప్లొమా, సీఏ, ఎంబీఏ/పీజీడీఎం, పీజీ డిప్లొమా, పీజీడీబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 మే 9వ తేదీ నాటికి జూనియర్ మేనేజర్‌కు 30 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 34 ఏళ్లు, మేనేజర్‌కు 42 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌కు 46 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్‌కు 28 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 38 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు జూనియర్‌ మేనేజర్‌కు రూ.40,000 - 1,40,000, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000 - రూ.1,60,000, మేనేజర్‌కు రూ.70,000 - 2,00,000, సీనియర్‌ మేనేజర్‌కు రూ.80,000 - రూ.2,20,000, ఎగ్జిక్యూటివ్‌కు రూ.30,000 - రూ.1,20,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.60,000 - 1,80,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 9.

Website:https://fsnl.co.in/career.php