Published on Jan 6, 2026
Current Affairs
ఫార్మా ఎగుమతులు
ఫార్మా ఎగుమతులు
  • 2024-25లో దేశీయ ఫార్మా ఎగుమతులు 9.4% వృద్ధితో సుమారు రూ.2.45 లక్షల కోట్ల (30.47 బిలియన్‌ డాలర్ల)కు చేరుకున్నాయని ఫార్మాస్యూటికల్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెగ్జిల్‌) 2026, జనవరి 5న తెలిపింది. ప్రస్తుతం రూ.5.41 లక్షల కోట్లు (60 బిలియన్‌ డాలర్లు)గా ఉన్న ఫార్మా మార్కెట్‌ 2030కి రూ.11.72 లక్షల కోట్ల (130 బి.డాలర్ల) స్థాయికి చేరుకుంటుందని అంచనా వెసింది.
  • భారతీయ జనరిక్‌ ఔషధాల ఎగుమతులను అంతర్జాతీయ మార్కెట్లో మరింత బలోపేతం చేసేందుకు ఫార్మెగ్జిల్‌ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారులతో ఫార్మెగ్జిల్‌ ప్రతినిధి బృందం ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించింది.