ఫార్మాసూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఫార్మాగ్జిల్) కొత్త ఛైర్మన్‌గా నమిత్ జోషి 2024, డిసెంబరు 26న బాధ్యతలు చేపట్టారు.
ఫార్మాగ్జిల్ 20వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయనను ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. ఇప్పటి వరకూ ఆయన వైస్‌ఛైర్మన్‌గా పనిచేశారు.
బెయిన్ కేపిటల్‌కు చెందిన సెంట్రియంట్ ఫార్మాసూటికల్స్‌కు డైరెక్టర్ (కమర్షియల్)గానూ వ్యవహరిస్తున్నారు. ఈయన ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందినవారు.