Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 12, 2026
Current Affairs
ఫోర్బ్స్‌ బిలియనీర్ల 2026 జాబితా
ఫోర్బ్స్‌ బిలియనీర్ల 2026 జాబితా
  • భారత్‌లో బిలియనీర్ల (కుబేరుల) సంఖ్య 2025లో 205 మంది ఉండగా, 2026 నాటికి 229కి చేరినట్లు ఫోర్బ్స్‌ బిలియనీర్ల 2026 జాబితా   వెల్లడించింది. వీరి మొత్తం సంపద విలువ లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.92 లక్షల కోట్ల)ను అధిగమించింది. 2025లో ఇది 941 బి. డాలర్లుగా ఉంది. అగ్రగామి 10 మంది భారతీయ కుబేరుల చేతిలో 368 బి. డాలర్ల (రూ.33.85 లక్షల కోట్ల) సంపద ఉంది. దేశంలోని మొత్తం బిలియనీర్ల సంపదలో ఇది మూడో వంతు కంటే ఎక్కువ. గతేడాదితో పోలిస్తే వీరి సంపద 32 బి. డాలర్లు పెరిగింది. 
  • భారత్, ఆసియాలో అగ్రగామి కుబేరుడుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ కొనసాగారు. గతేడాదితో పోలిస్తే ఆయన సంపద 12% పెరిగింది. రెండో స్థానంలో గౌతమ్‌ అదానీ నిలిచారు. ఓపీ జిందాల్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రి జిందాల్‌ అత్యంత ధనవంతురాలైన భారతీయ మహిళగా నిలిచారు.