Published on Oct 7, 2025
Current Affairs
ఫ్రాన్స్‌ ప్రధాని రాజీనామా
ఫ్రాన్స్‌ ప్రధాని రాజీనామా

ఫ్రాన్స్‌ కొత్త ప్రధాని సెబాస్టియన్‌ లెకొర్ను 2025, అక్టోబరు 6న తన పదవికి రాజీనామా చేశారు.

సెప్టెంబరు 9న పదవిని చేపట్టిన నెలలోపే లెకొర్ను అధికారం నుంచి దిగిపోయారు.

సెబాస్టియన్‌ నియమించిన క్యాబినెట్‌పై విమర్శలు రావడంతో ఆయన రాజీనామా చేశారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌కు అత్యంత సన్నిహితుడిగా సెబాస్టియన్‌కు పేరుంది. 

మెక్రాన్‌ ఈ రాజీనామాను ఆమోదించారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది.