ఫ్రాన్స్‌లో ప్రధానమంత్రి ఫ్రాన్సువా బేరూ నాయకత్వంలోని మైనారిటీ ప్రభుత్వం 2025, సెప్టెంబరు 8న ఓటమిపాలైంది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో జరిగిన ఓటింగులో ప్రభుత్వానికి అనుకూలంగా 194 మంది సభ్యులు, ప్రతికూలంగా 364 మంది ఓటేశారు.
దీంతో ప్రధాని బేరూ.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌కు రాజీనామా సమర్పించారు.