కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) వివిధ సైంటిఫిక్, టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 31
వివరాలు:
1. డిప్యూటీ డైరెక్టర్ (సైబర్ సెక్యూరిటీ/సైబర్ డిఫెన్స్): 01
2. డిప్యూటీ డైరెక్టర్ (ఫోరెన్సిక్ సైకాలజీ): 01
3. అసిస్టెంట్ డైరెక్టర్ (ఎన్‌డీపీఎస్): 01
4. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ సెక్యూరిటీ/సైబర్ డిఫెన్స్): 01
5. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (NDPS): 01
6. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (బాలిస్టిక్స్): 01
7. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఫోరెన్సిక్ అకౌంటింగ్): 01
8. లాబొరేటరీ అసిస్టెంట్: 24
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ సైన్స్, సైకాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ లేదా అకౌంటింగ్ విభాగాల్లో పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: లాబొరేటరీ అసిస్టెంట్: 18 నుంచి 27 ఏళ్ల మధ్య, డిప్యూటీ డైరెక్టర్‌కు 50ఏళ్లు; అసిస్టెంట్ డైరెక్టర్‌కు 45 ఏళ్లు, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌కు 40 ఏళ్లు, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌కు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ/ఎస్టీ, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 23.03.2026.
Website:https://www.nfsu.ac.in/