Published on Jun 9, 2025
Current Affairs
ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేత కొకో గాఫ్‌
ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేత కొకో గాఫ్‌

ప్రపంచ నంబర్‌ 2 కొకో గాఫ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది.

2025, జూన్‌ 7న పారిస్‌లో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆమె 6-7 (5-7), 6-2, 6-4తో టాప్‌ సీడ్‌ సబలెంకా (బెలారస్‌)పై విజయం సాధించింది.

మ్యాచ్‌లో గాఫ్‌ మూడు ఏస్‌లు, 30 విన్నర్లు కొట్టింది.

రెండు ఏస్‌లు, 37 విన్నర్లు కొట్టిన సబలెంకా.. ఏకంగా 70 అనవసర తప్పిదాలు చేసింది.

సబలెంకా 6, గాఫ్‌ 8 డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు.  

గాఫ్‌కు కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్‌.

ఇంతకుముందు 2023లో యుఎస్‌ ఓపెన్‌ గెలిచింది.

అప్పుడు కూడా ఆమె ఫైనల్లో సబలెంకాపై నెగ్గింది.

గాఫ్‌ 2022లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది.