మనదేశంలో అతిపెద్ద, అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ‘ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్ ఫర్ 2024’లో ప్రపంచంలోనే అత్యత్తుమ రెండో బ్రాండ్‌గా నిలిచింది.
యాపిల్, నైక్ వంటి బహుళజాతి సంస్థలను పక్కకు నెట్టి మరీ ఈ స్థానాన్ని రిలయన్స్ పొందింది. ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ బ్రాండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కావడం విశేషం.
మార్కెట్ విలువ ఆధారంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న 100 కంపెనీలకు ఫ్యూచర్‌బ్రాండ్ ర్యాంకులిస్తుంటుంది.
2023లో 13వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, 2024లో 11 స్థానాలు పైకి వచ్చి, రెండో స్థానంలో నిలిచింది.
దక్షిణ కొరియా బ్రాండ్ శాంసంగ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.