Published on Sep 5, 2025
Apprenticeship
ఫ్యాక్ట్‌లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
ఫ్యాక్ట్‌లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు

కేరళ రాష్ట్రం ఉద్యోగమండల్‌లోని ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్‌) ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌లో భాగంగా కింది విభాగాల్లో గ్రాడ్యుయేట్‌ అండ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 84.

వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 27 

విభాగాలు: కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్/ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్.

2. టెక్నీషియన్ (డిప్లొమా అప్రెంటీస్): 57 

విభాగాలు: కెమికల్, కంప్యూటర్, సివిల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంట్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కమర్షియల్ ప్రాక్టీస్.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.12,000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.9000.

గరిష్ఠ వయోపరిమితి: 01-09-2025 నాటికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 25 ఏళ్లు, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు 23 ఏళ్లు మించకూడదు. 

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 20-09-2025.

Website:https://fact.co.in/home/Dynamicpages?MenuId=909