Published on Mar 3, 2025
Current Affairs
ఫిబ్రవరి జీఎస్‌టీ వసూళ్లు
ఫిబ్రవరి జీఎస్‌టీ వసూళ్లు

2025, ఫిబ్రవరిలో జీఎస్‌టీ స్థూల వసూళ్లు 9.1% పెరిగి రూ.1.84 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ వినియోగం పెరగడం ఇందుకు కారణమైంది.

దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్‌టీ వసూళ్లు 10.2% అధికమై రూ.1.42 లక్షల కోట్లుగాను; దిగుమతులపై జీఎస్‌టీ ఆదాయం 5.4 శాతం పెరిగి రూ.41,702 కోట్లుగాను నమోదయ్యాయి.

కేంద్ర జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) రూ.35,204 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) రూ.43,704 కోట్లుగా ఉంది. ఐజీఎస్‌టీ రూ.90,870 కోట్లు, పరిహారం సెస్సు రూ.13,868 కోట్లుగా నమోదయ్యాయి.

ఫిబ్రవరిలో మొత్తం రిఫండ్‌లు 17.3% పెరిగి రూ.20,889 కోట్లకు చేరాయి. నికర జీఎస్‌టీ వసూళ్లు 8.1% వృద్ధితో రూ.1.63 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.