బ్రెజిల్ ఆటగాడు ఫాబియో ప్రపంచంలో అత్యధిక ప్రొఫెషనల్ సాకర్ మ్యాచ్‌లు ఆడిన ఫుట్‌బాలర్‌గా రికార్డు సృష్టించాడు. అతడి మ్యాచ్‌ల సంఖ్య 1,391కు చేరుకుంది. ఫాబియో ఫ్లుమినెన్స్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంగ్లాండ్ గోల్ కీపర్ పీటర్ షిల్టన్ నెలకొల్పిన రికార్డును ఫాబియో అధిగమించాడు. 90వ దశకంలో కెరీర్‌ను ఆరంభించిన ఫాబియో వయసు ప్రస్తుతం 44ఏళ్లు.