తాజా ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌లో భారత యువ టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఫిదెల్ స్నేహిత్ 89వ స్థానంలో నిలిచాడు.
ఇటీవల డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసిన స్నేహిత్.. 34 స్థానాలు మెరుగయ్యాడు.
భారత్ తరఫున స్నేహిత్ కాకుండా మానవ్ థక్కర్ (47వ ర్యాంకు), హర్మీత్ దేశాయ్ (68), మనుష్ షా (73), శరత్ కమల్ (80) టాప్-100లో ఉన్నారు.