Published on Mar 3, 2025
Current Affairs
ఫిడే క్లాసికల్‌ రేటింగ్స్‌
ఫిడే క్లాసికల్‌ రేటింగ్స్‌

ఫిడే క్లాసికల్‌ రేటింగ్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ కెరీర్‌లో ఉత్తమంగా మూడో ర్యాంకు సాధించాడు.

2024, డిసెంబర్‌లో డింగ్‌ లిరెన్‌ ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌ అప్పటి నుంచి స్థిరంగా రాణిస్తున్నాడు.

ఇటీవల ప్రదర్శనతో ఖాతాలో పది పాయింట్లు చేరడంతో 2787 రేటింగ్‌తో ఉన్నాడు. 

మరో భారత స్టార్‌ అర్జున్‌ ఇరిగేశి (2777) అయిదో ర్యాంకులో నిలిచాడు. ఇంకోవైపు ప్రజ్ఞానంద తిరిగి టాప్‌-10లోకి వచ్చాడు.

తాజాగా టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచిన అతడు 17 రేటింగ్‌ పాయింట్లు సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం అతడు 2758 పాయింట్లతో ఎనిమిదో ర్యాంకులో ఉన్నాడు.