2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత జట్టుకు రికార్డు స్థాయిలో రూ.451 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. 2022 ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనాకు రూ.379 కోట్లు లభించాయి. గత కప్‌తో పోలిస్తే ఈసారి మొత్తం నగదు బహుమతిని ఫిఫా 48.9 శాతం పెంచింది. 2022 కప్‌లో మొత్తం ప్రైజ్‌మనీ 3971 కోట్లు కాగా.. ఈసారి రూ.5911 కోట్లకు పెరిగింది.
గ్రూప్ దశలో పోటీపడే 48 జట్లకు రూ.81 కోట్ల చొప్పున దక్కనున్నాయి.