వైఎస్సార్ కడప జిల్లాలోని పుష్పగిరి పరిధి శ్రీవైద్యనాథేశ్వరస్వామి ఆలయానికి పడమర దిశలో ఉన్న నాగేశ్వరస్వామి దేవాలయంలోని శాసనాలు 13వ శతాబ్దానికి చెందినవిగా నిర్ధారించారు. చెన్నైకి చెందిన భారత పురావస్తు శాఖ సిబ్బంది 2025, నవంబరు 16న ఈ పరిశీలన చేశారు.
చరిత్రకారుడు, రచయిత బొమ్మిశెట్టి రమేశ్ పరిశీలనలో ఇక్కడి నాగేశ్వరస్వామి ఆలయంతో పాటు శాసనాలు వెలుగులోకి వచ్చాయి. గర్భాలయంలో శివలింగానికి పాము చుట్టుకుని ఉండటం ఈ ఆలయంలోని ప్రత్యేకత.