దేశంలోని 6-23 నెలల మధ్య గల 77శాతం మంది పిల్లలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన వైవిధ్యభరితమైన పోషకాహారం అందడం లేదని ఒక అధ్యయనం పేర్కొంది. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో నివసించే పిల్లల్లో ఈ లోపం 80% వరకు కనిపిస్తోంది.
తల్లిపాలు ఇవ్వడంతోపాటు గుడ్లు, పండ్లు, చిక్కుళ్లు, విత్తనాలున్న పదార్థాలను తినిపించడం వల్ల పిల్లలకు సంపూర్ణ పోషకాహారం లభిస్తుందని అధ్యయనం పేర్కొంది.
2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) వివరాలు, జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ గణాంకాల ఆధారంగా పోషకాహార విశ్లేషణ చేశారు.