భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో 500 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆరో క్రీడాకారిణిగా ఘనత అందుకుంది. ఈ రికార్డు నమోదు చేసిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. ఇండోనేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో సింధు ఈ చిరస్మరణీయ విజయంతో క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. 2026, జనవరి 22న ప్రిక్వార్టర్స్‌లో భారత స్టార్ 21-19, 21-18తో లైన్ హోయ్‌మార్క్ (డెన్మార్క్)పై గెలుపొందింది.
డబుల్స్ మ్యాచ్‌లను జోడీస్తే సింధు ఖాతాలో మొత్తం 516 విజయాలున్నాయి.