మహారాష్ట్రలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 28 (అన్ రిజర్వ్‌డ్-13, ఓబీసీ-7, ఎస్సీ-4, ఎస్టీ-2, ఈడబ్ల్యూఎస్-2, ఎక్స్‌సర్వీస్ మెన్-3)
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టం ఇంజినీరింగ్, పవర్ ఇంజినీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 మార్చి 25వ తేదీ నాటికి 29 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.23,000 - రూ.1,05,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25-03-2025.